Ads 468x60px

Monday, July 9, 2012

కొండాకోనల్లో లోయల్లో

కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మా ఈ కోయిలమ్మా  // కొండాకోనల్లో //

నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మ్రోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగాఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా
ఊపిరి ఊయల లూగంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగతెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగ
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా...    // కొండాకోనల్లో //

ఝుమ్మనీ తుమ్మెద తీయంగా కమ్మనీ రాగం తీయ్యంగా
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మనీ రాగం తీయ్యంగా జానపదాలే నింపంగా
చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టా లేయంగాచెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టా లేయంగా
చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగాఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా
స్వరాలన్నీ దీవించంగా సావాసంగా

కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లోలోయల్లో ఛాయల్లో... లోయల్లో ఛాయల్లో...

 చిత్రం: స్వాతి కిరణం
సంగీతం: కే. వి. మహదేవన్
గానం: వాణీ జయిరాం

0 comments:

Post a Comment

Share

Widgets