Ads 468x60px

Friday, August 8, 2008

గలగల పారుతున్న గోదారిలా...




గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరలా

నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ.. హాయిలా !

ll గల గల ll

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నాపైనా
మిన్నేటి దారులా వేచి.. నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవేలా చేరుతావిలా నాలోనా
ఊ.. ఓ.. ఈ అల్లరి
ఊ...ఓ ..బాగున్నదీ

ll గల గల ll

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగౌన్నదీ ఏమైనా
ఊ.. ఓ. ఈ లాహిరి
ఊ.. ఓ .. నే ప్రేమని

ll గల గల ll

చిత్రం: పోకిరి
గానం :నిహాల్
రచన: కందికొండ
సంగీతం: మణిశర్మ

తెలిసిందిలే .. తెలిసిందిలే..



తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలిరమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే

ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము
ముందుందిలే నీ ముందుందిలే
ll తెలిసిందిలే ll

వరహల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ...

అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల
అనుకొందునా అనుకొందునా

ll తెలిసిందిలే ll

సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ లేమిటో
శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది
ll తెలిసిందిలే ll

చిత్రం : రాముడు భీముడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర్‌రావు

నా హృదయంలో నిదురించే చెలి






నా హృదయంలో నిదురించే చెలీ !
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
ll నా హృదయంలో ll

నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసొనా
కన్నులలోనా దాగెనులే వెన్నెలసోనా
చకోరమై నిను వరించి
అనుసరించినావే కలవరించినావే
ll నా హృదయంలో ll

నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీద వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే

ll నా హృదయములో ll

చిత్రం : ఆరాధన
గానం : ఘంటసాల
రచన: శ్రీ శ్రీ
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు

గుండెల్లో ఏముందో ...



గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం
నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం'
నీ అలికిడి నినకుంటే
కలవరమో తొలివరమో
తెలియని తరుణమిది
ll గుండెల్లో ll
మనసా మనసా మనాసా
ఓ మనసా..!

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నినిలా హ్చూసి పయనించి
వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ
ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో. ఇదంతా..నిజంగా కలలాగే ఉంది.
ll గుండెల్లో ll

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే
పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ
పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం
ఇంకెప్పుడొస్తుంది!
ll గుండెల్లో ll

మనసా.. మనసా.. మనసా
ఓ మనసా..!

చిత్రం : మన్మధుడు
గానం: వేణు, సుమంగళీ
రచన: సిరివెన్నెల
సంగీతం :దేవిశ్రీ ప్రసాద్

నిలువుమా! నిలువుమా! నీలవేణి...

నిలువుమా!
నిలువుమా ! నిలువుమా! నీలవేణీ
నీ కనుల నీలినీడ
నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

అడుగడుగున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా

సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే వయ్యరపు ఒంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

నా ఊర్వశి రావే రావేయని పిలువనా
ఆ సుందరి నెరనీకు నీ గోటికి సమమౌనా
రా చెలీ నినుమదీ దాచుకోనీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

చిత్రం : అమరశిల్పి జక్కన్న
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఎస్.రాజేశ్వర్‌రావు
Share

Widgets