Friday, August 8, 2008
గలగల పారుతున్న గోదారిలా...
గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరలా
నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ.. హాయిలా !
ll గల గల ll
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నాపైనా
మిన్నేటి దారులా వేచి.. నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవేలా చేరుతావిలా నాలోనా
ఊ.. ఓ.. ఈ అల్లరి
ఊ...ఓ ..బాగున్నదీ
ll గల గల ll
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగౌన్నదీ ఏమైనా
ఊ.. ఓ. ఈ లాహిరి
ఊ.. ఓ .. నే ప్రేమని
ll గల గల ll
చిత్రం: పోకిరి
గానం :నిహాల్
రచన: కందికొండ
సంగీతం: మణిశర్మ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment