Ads 468x60px

Friday, August 8, 2008

తెలిసిందిలే .. తెలిసిందిలే..



తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలిరమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే

ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము
ముందుందిలే నీ ముందుందిలే
ll తెలిసిందిలే ll

వరహల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ...

అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల
అనుకొందునా అనుకొందునా

ll తెలిసిందిలే ll

సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ లేమిటో
శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది
ll తెలిసిందిలే ll

చిత్రం : రాముడు భీముడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర్‌రావు

0 comments:

Post a Comment

Share

Widgets