Ads 468x60px

Wednesday, November 14, 2007

పాడుతా తీయగా చల్లగా

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు
గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది
మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమకది మరీ గట్టిపడతది

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

చిత్రం : మూగమనసులు
గానం : ఘంటసాల

1 comments:

  1. Kavi bhavanaku pranam posaru Ghantasala garu. Kavi entha goppaga rasina gayakudu sariga padalekapothe pataku jeevam undadu.

    ReplyDelete

Share

Widgets