పిలిచినా బిగువటరా...

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా ఆ

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా

గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి రామకృష్ణ

1 comments:

వికటకవి November 14, 2007 4:05 PM  

ఈ పాటని ఇప్పటికి కనీసం ఓ వంద సార్లైనా వినుంటాను. ఎప్పుడూ స్వచ్ఛంగా, కొత్తగా ఉంటుంది. అద్భుతమయిన అనుభూతి.సాహిత్యానికి కృతజ్ఞతలు.

గమనిక

బ్లాగు సార్వజనీక ఉపయోగార్థం వ్రాయబడినది, ఇందులోని విషయాల కాపీరైటు ఆయా పోస్టులలో చెప్పబడిన వారికి చెందినది అయి ఉండ వచ్చు, . ఏదైనా పోస్టులపై ఏమైనా అభ్యంతరాలున్నచో ఓ కామెంటు వ్రాయగలరు.

రసజ్ఞులు

వర్గాలు

తెలుగు వెలుగులు