Ads 468x60px

Friday, September 5, 2008

చంద్రుల్లో ఉండే కుందేలు



చంద్రుల్లో ఉండే కుందేలూ కింది కొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
చుక్కల్లో ఉండే జిగేలూ నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా

నువ్వలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంటా
ఏవంటా
నీవల్లే దారే మారిందా
నీవల్లే తీరే మారీ ఏరై పారిందేమో నేలంతా

చంద్రుల్లో ఉడే కుందేలూ కింది కొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకువచ్చావే ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వలో

కూచిపూడి అన్న పదం
కొత్త ఆట నేర్చిందా
పాట లాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావలీల జానతనం బాట చూపగా

కుంచలో దాగే వర్ణాలూ ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్నాలూ
మంచులో దాగే చైత్రాలూ బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలూ

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంతవరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో

మట్టికీ మబ్బుకి ఈ వేలా దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే దద్దరపడిపోవా

చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా

0 comments:

Post a Comment

Share

Widgets