Friday, September 5, 2008
ఉరకలై గోదావరి
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
నీ ప్రణయ భావం .. నా జీవ రాగం (2)
రాగాలూ తెలిపే .. భావాలు నిజమైనవి
లోకాలూ మురిసే .. స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
నా పేద హృదయం .. నీ ప్రేమ నిలయం (2)
నాదైన బ్రతుకే .. ఏ నాడో నీదైనది
నీవన్న మనిషే .. ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికీ బ్రతుకైనదీ
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
చిత్రం : అభిలాష
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
రచన : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment