Saturday, March 7, 2009
నేనొక ప్రేమ పిపాసిని
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని....
తలుపు మూసిన తలవాకిటిలో
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...
పూట పూట నీ పూజ కోసమని
పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోట్టగా
ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా
నీ చెవిన పడితే చాలునని
నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని...
చిత్రం : ఇంద్ర ధనుస్సు
గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం
రచన : ఆత్రేయ
సంగీతం : కే.వి.మహాదేవన్
Subscribe to:
Post Comments (Atom)
జ్యోతి గారు-
ReplyDeleteతలుపు మూసిన తన వాకిటిలో, వాకితిలో కాదు..:)
భాస్కర్ గారు,
ReplyDeleteధన్యవాదాలు, అప్పు తచ్చు సరి చేసాను ...
జ్యోతి గారు,
ReplyDeleteముందుగా మీ ఒపికకూ ఇష్టానికీ జోహార్లు
మీ అమూల్యమైన భాండాగారంలో ఉన్న వాటిని సమయానుకూలంగా ఆస్వాదించాలంటే "శోధన" మీట తప్పనిసరండీ... ప్రయత్నిచకూడదు? ...
మా ఆవిడా - నేను లిటిల్ చాంప్స్, ఒక్కరే వగైరాలతో పాటు పాడుకోవాలంటే ఎంత ఉపయోగపడతాయో అప్పుడు :-)