రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలు నే సొమ్మంటీ
నాతోడు నీవైయుంటే నీ నీడ నేనేనంటి..
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నీపైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి...
నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే కాయలాంటి
నీ కాలిమువ్వల రవళి
నా భావి మోహన మురళి
ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి...
నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోని పోమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి ....
చిత్రం : మంచి -చెడు
గానం : ఘంటసాల, ఫై.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాధన్ - రామమూర్తి
రేపంటి రూపం కంటి
Posted by
జ్యోతి
Saturday, March 7, 2009








1 comments:
Jyothi garu,
chaala manchi songs selection andi.. Ivanni naaku favourite songs kooda... Inka gayam lo alupannadi undaa song kooda baavuntundi kadaa.. adi pettaledemi meeru..
Devasena
Post a Comment