Sunday, October 30, 2011
చిరునవ్వులోని హాయి
చిరునవ్వులోని హాయి
చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి
ఈ నాడు కలిగెనోయి (2)
నెలరాజు సైగచేసె
వలరాజు తొంగిచూసె(2)
సిగపూలలోన నగుమొములోన
వగలేవొ చిందులేసె(2)
నయనాల తారవీవె
నా రాజహంస రావె(2)
ఆ..ఆ..ఆ..
నను చెరదీసి
మనసార చూసి పెనవెసి నావు నీవె(2)
పవళించు మేనిలోన
రవళించె రాగవీణ(2)
నీలాలనింగి లోలోనపొంగి
కురిపించె పూలవాన(2)
చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి
ఈ నాడు కలిగెనోయి !!
చిత్రం: అగ్గిబరాటా
సంగీతం: విజయా కృష్ణమూర్తి
రచన: C. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
Subscribe to:
Post Comments (Atom)
♫
♩
♪
♫
♭
♩
♫♭
0 comments:
Post a Comment