Ads 468x60px

Sunday, October 30, 2011

తెల్లవారనీకు ఈ రేయిని
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని

నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని
ఆ కైపులో లోకాలే మరువన
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని
ఆ కైపులో లోకాలే మరువని
మనసులో మనసునై మసలన
మనసులో మనసునై మసలనీ
నీ మనిషినై మమతనై మురిసిపోన
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని

నీ కురులే చీకటులై కప్పివేయనీ
ఆ చీకటిలో పగలు రేయి ఒక్కటై పోన
నీ కురులే చీకటులై కప్పివేయనీ
ఆ చీకటిలో పగలు రేయి ఒక్కటై పోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోన
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోన
తడియారని హృదిలో నను మొలకలెత్తన
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని

మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ
అల్లరి పడుచుదనం కొల్లబోనీ
మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ
అల్లరి పడుచుదనం కొల్లబోనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లన
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
చల్లగా కాపురమూ ఉండిపోన
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని

చిత్రం: ఆత్మబలం
సంగీతం:: KV మహాదేవన్
రచన:: ఆచార్య,ఆత్రేయ
గానం:: ఘంటసాల,P.సుశీల

0 comments:

Post a Comment

Share

Widgets