Ads 468x60px

Saturday, May 24, 2008

నే తొలిసారిగా కలగన్నదీ





నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా

చిత్రం : సంతోషం

రచన : సీతారామ శాస్త్రి

గానం : ఉష

సంగీతం : ఆర్. పీ . పట్నాయక్

చిగురాకులలో చిలకమ్మా




ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు

నీ చిరునవ్వుకు సరికావమ్మ
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య

వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ

పై మెరుగులకే భ్రమపడకయ్య
మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య

ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ

చిత్రం : దొంగరాముడు

గానం : ఘంటసాల, జిక్కి

ప్రేమ లేదని..




ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికయినా కన్నీరుందన్ని
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ
ప్రేమ లేదని లాలలాలల

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడా చేయలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

చిత్రం : అభినందన

గానం : ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం : ఇళయరాజా



ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే సందెవేళ జాబిలి నా గీత మాల ఆమని
నా పలుకు తేనె కవితలే నా పిలుపు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే మనసు పాడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చెయనే
నే సాగు బాట జాజి పూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ

ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం


చిత్రం : ఘర్షణ

గానం : వాణి జయరాం

సంగీతం : ఇళయరాజా

ఆమని పాడవే ..



ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా
ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధనేనని
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో

శుకాలతో పికాలతో ధ్వనించిన మధోదయం
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా
ఆమని పాడవే హాయిగా

చిత్రం : గీతాంజలి

గానం : బాలు

సాహిత్యం : వేటూరి

సంగీతం : ఇళయరాజా

Share

Widgets