Ads 468x60px

Saturday, May 24, 2008

నే తొలిసారిగా కలగన్నదీ





నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా

చిత్రం : సంతోషం

రచన : సీతారామ శాస్త్రి

గానం : ఉష

సంగీతం : ఆర్. పీ . పట్నాయక్

0 comments:

Post a Comment

Share

Widgets