Ads 468x60px

Wednesday, August 15, 2007

సారే జహాసె అచ్చా!





సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా,
హం బుల్ బులే హై ఇస్‌కీ
యే గుల్ సితా హమారా,హమారా.

పర్ బత్ వో సబ్‌సే ఊంచా
హంసాయ ఆస్‌మాకా
వోసంతరీ హమారా - వో పాస్వా
హమారా,హమారా.

గోదీమె భేలిలీ హై
ఇస్‌కీ హజార్ నదియా
గుల్షన్ హై ఇస్‌కేదమ్ సే
రష్‌కేబినా హమారా, హమారా.

మజ్ హబ్ నహీ సిఖాతా
ఆపస్‌మే బైల్ రఖనా
హింధీ హై హం(3) వతన్ హై
హిందూ సితా హమారా,హమారా.

సారే జహాసె అచ్చా...

రచన : ఇక్బాల్

భరత మాత





నగర మాంధాత్రాది షట్చక్రవర్తుల

యంకసీమల నిల్చినట్టి సాధ్వి

కమలనాభుని వేణుగానసుధాంబుధి

మునిగి తేలిన పరిపూతదేహ

కాళిదాసాది సత్కవికుమారుల గాంచి

కీర్తి గాంచిన పెద్ద గేస్తురాలు

బుద్ధాది మునిజనంబుల తపంబున మోద

బాష్పములిడిచిన భక్తురాలు

సింధు గంగానదీ జలక్షీరమెపుడు

గురిసి బిడ్డల భోషించుకొనుచున్న

పచ్చి బాలెంతరాలు మా భరతమాత

మాతలకు మాత సకలసంపత్సమేత...


రచన : స్వర్గీయ గుర్రం జాషువ

మా గాంధి



కొల్లాయి గట్టితే నేమీ
మా గాంధి,
కోమటై పుట్టితే నేమీ?

కొల్లాయి ...

వెన్న పూసా మనసు
కన్నతల్లి ప్రేమ
పండంటి మోముపై
బ్రహ్మ తేజస్సు

కొల్లాయి...

నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాలూగూవేదాలా
నాణ్యమెరిగిన పిలక

కొల్లాయి...


బోసినోర్విప్పితే
ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే
వరహాల వర్షమే

కొల్లాయి...

చకచక నడిస్తేను
జగతి కంపించేను
పలుకు పలికితేను
బ్రహ్మకౌక్కేను

కొల్లాయి...

వాశికుడు క్షత్రియుడు
కాలేద బ్రహ్మౠషి
నేడు కోమటి బిడ్డ
కూడ బ్రహ్మర్షియే

కొల్లాయి...


రచన : స్వర్గీయ బసవరాజు అప్పారావు

శ్రీలు పొంగిన జీవగడ్డ

శ్రీలు పొంగిన జీవగడ్డయు
పాలు పాఱిన భాగ్యసీమయు
వ్రాసినది యీ భరతఖండము
భక్తి పాడర;తమ్ముడా!

వేదశాఖలు పెరిగె నిచ్చట
ఆదికావ్యంబందె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!

విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్వము విస్తరించిన
విమల తలమిదె తమ్ముడా!


సూత్ర యుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్ర దాస్యముచే చరిత్రల
చెఱిగిపోయెనే చెల్లెలా!

మేలి కిన్నెర మేలవించీ
రాలు కరగగ రాగ మెత్తీ
పాల తీయని బాల భారత
పదము పాడర తమ్ముడా!

నవరసమ్ములు నాట్యమాడగ
చివుర పలుకులు చెవుల విందుగ
కవిత లల్లిన కాంత హృదయం
గౌరవింపవె చెల్లెలా!

దేశ గర్వము దీప్తిచెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన దీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!

పాండవేయమల పదును కత్తులు
నుండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కవి. తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా!

లోకమంతకు కాక పెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవ పదముల
చేర్చిపాడర తమ్ముడా!

తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిది త్రుళ్ళీ
భంగపడని తెలుంగు నాధుల
పాట పాడవె చెల్లెలా!

రచన: రాయప్రోలు సుబ్బారావు

జయ జయ ప్రియ భారతి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సు శ్యామ చలాంచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!


జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!


రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
Share

Widgets