
కొల్లాయి గట్టితే నేమీ
మా గాంధి,
కోమటై పుట్టితే నేమీ?
కొల్లాయి ...
వెన్న పూసా మనసు
కన్నతల్లి ప్రేమ
పండంటి మోముపై
బ్రహ్మ తేజస్సు
కొల్లాయి...
నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాలూగూవేదాలా
నాణ్యమెరిగిన పిలక
కొల్లాయి...
బోసినోర్విప్పితే
ముత్యాల తొలకరే
చిరునవ్వు నవ్వితే
వరహాల వర్షమే
కొల్లాయి...
చకచక నడిస్తేను
జగతి కంపించేను
పలుకు పలికితేను
బ్రహ్మకౌక్కేను
కొల్లాయి...
వాశికుడు క్షత్రియుడు
కాలేద బ్రహ్మౠషి
నేడు కోమటి బిడ్డ
కూడ బ్రహ్మర్షియే
కొల్లాయి...
రచన : స్వర్గీయ బసవరాజు అప్పారావు
0 comments:
Post a Comment