Ads 468x60px

Saturday, May 24, 2008

పెదవే పలికిన మాటల్లోనే..



పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే... అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా ఔతుండగా జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

పొత్తిళ్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవ్వనా
నా కొంగు పట్టేవాడు నా కడుపును పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్నినాన్ననీ వాడి నాన్ననీ నూరేళ్లు సాకనా చల్లగా చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దులకన్నా జోజో
బంగరు తండ్రీ జోజో బజ్జో లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

చిత్రం : నాని

రచన : చంద్రబోస్

గానం : ఉన్నికృష్ణన్, సాధనా సర్గం

సంగీతం : ఎ.ఆర్. రెహ్మాన్

1 comments:

  1. ఎన్ని సార్లు విన్నానో తెలియదు .. ఈ పాట నన్ను దోచేసింది ..

    Screenplay బాగాలేదు కానీ చాలా బాగుంది

    ReplyDelete

Share

Widgets