Ads 468x60px

Saturday, February 3, 2007

అనగనగా ఒక రాజు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు 11అనగనగా11

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను
కంటిపాప కంటె యెంతో గారవించేను
కంటిపాప కంటె యెంతో గారవించేను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను 11అనగనగా11

నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా కుక్క మేలురా 11అనగనగా11


చిత్రం : ఆత్మ బంధువు
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల,సుశీల

0 comments:

Post a Comment

Share

Widgets