నల్లా చీర నల్లా రైక
నాలుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
తెల్లా చీర తెల్లా రైక
తెల్లవారంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
ఎర్రా చీర ఎర్రా రైక
ఎడుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
పచ్చా చీర పచ్చా రైక
పదిగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
సీటీ చీర సీటీ రైక
సుట్టుకుంటే సింగారమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
కళ్ళకు కాటుక నుదుటికి బొట్టు
పెట్టుకుంటే వయ్యారమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
సేకరణ గానం: ఏ.జంగిరెడ్డి
Thursday, February 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
♫
♩
♪
♫
♭
♩
♫♭
0 comments:
Post a Comment