జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై కవితనై..భార్యనై భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ
వంటరినై అనవరతం .. కటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై..శశినై..దివమై..నిశినై
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ
గాలిపల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలీ
నా హృదయమే నా పాటకి తల్లీ
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చిత్రం : చక్రం
గానం : శ్రీ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం:చక్రి
powered by ODEO
Saturday, February 24, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment