మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈ నాడే
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెర తాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరెను
అందల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను.
రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేను లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
చిత్రం : ఆత్మీయులు
రచన : దాశరథి
గానం : సుశీల
సంగీతం: ఎస్.రాజేశ్వర్ రావు
powered by ODEO
Saturday, February 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment