గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలొతులో యేమూలనో
నిదురించు ఙాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో యే మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
11 గుర్తు 11
మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై చేసిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రి
కొతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సూతు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
11 గుర్తు 11
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటూ
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనమ
మొదటి ప్రేమలో తీయందనము
11 గుర్తు 11
చిత్రం : నా ఆటోగ్రాఫ్
రచన : చంద్రబోస్
powered by ODEO
Saturday, February 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment