Ads 468x60px

Tuesday, February 20, 2007

అందెను నేడే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఇన్నేళ్ళకు విరిసే వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మృఒగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

చిత్రం: ఆత్మగౌరవం
గానం : ఘంటసాల
రచన :దాశరధి

1 comments:

  1. జ్యొతీ,
    మంచి సెలెక్షన్ అండి. నేను చేసిన స్పెషల్ ప్రోగ్రాంలో కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న పాటలు వున్నాయి. థాంక్స్ జ్యొతి, దాశరథి గారి జయంతి సందర్భంగా ఆయనకి మీరు ఇచ్చిన ట్రిబ్యూట్ చాలా బాగుంది. నేను స్పెషల్ ప్రొగ్రాం చేసి దాశరథి పేజి లొ పొస్ట్ చేసాను.

    ReplyDelete

Share

Widgets