Ads 468x60px

Saturday, December 15, 2007

గజ్జెలెడ్లబండి

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం బోతున్నా
రావే రంగమ్మో జాతరన్న బోదాము..//రావే//

కంచిపట్టు చీరలేదు ! అంచులున్న రవికెలేదు
మంచి మల్లెపూలమీద మనసేమొ గుంజవట్టె
రానుపోర జాతరా గంగవరం నీవెంట..//రాను//

మంచి చీరెలిపిస్తా! మల్లెపూలు దెప్పిస్తా
అంచులున్న రైకమీద అద్దాలేపిస్త పిల్లా//రావే//

చేతులొక పైసలేదు! చేతికి గాజూలు లేవు
చెప్పుకోవాలంటే సిగ్గేలో రావాయే..//రాను//

చేతిగాజులిప్పిస్తా! చేతి ఖర్చు పైసలిస్తా
చెకుముఖిరవ్వ సిగ్గెందుకెపిల్లా..//రావే//

కడియాలు లేకపాయె కంకణాలు లేకపాయె
అడిగేటందుకేమో చాల బిడియపడి సస్తున్నా..//రాను//

కడియాలు ఇప్పిస్తా! కంకణాలు దెప్పిస్తా
అడుగులెయ్యి ముద్దులొలక అందాల రామచిలుక..//రావే//

బోడిమెడ బెట్టుకొని! యాడకొత్తు నీయెంటా
అడ్డిగొకటి అడగాలటని హడలిపోయి సస్తున్నా..//రాను//

మెడకు మంచి హారమేస్త! మేలైన సొమ్ములిస్త
తడవు సేయకుండదావె తరణివెల్లిపోదాము...//రావే//

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం నేనొస్తా
ఆపుర అంజయ్యో బండి మీద నేనొస్తా//ఆపుర//

రావే రంగమ్మో జాతరన్న పోదాము
ఆపుర అంజయ్యో బండిమీద నేనొస్తా //ఆపుర//

రచన : ఆర్.వీరాచారి

0 comments:

Post a Comment

Share

Widgets