చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//
చిత్రం : శుభలగ్నం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల
Saturday, December 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment