రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి రామాయణ సత్కృతి
ఆకృతి వరియించిన పతివి నీవే అతులిత కైవల్య గతివి నీవే!...
జగమే రామమయం ! మనసే
అగణిత తారక నామ మయం
నీల జలద రమణీయ రూపం నిగమాంచల మందిర మణిదీపం
సుందర జానకీ వందిత చరణం
సురముని శరణం! భవతాప హరణం
ఆ చిరునవ్వే అమృతపు జల్లు అఖిల జగములేలు ఆచేతి విల్లు
అతని గానమున అలరారుకావ్యం అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం
ఎవని కమల కమనీయ పదము! చూ
పించె అహల్యకు ముక్తి పదము!
ఎవని చంద్రిక మృదుల కరము! అం
దించెను శబరికి దివ్యవరము
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో!
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి, ఈ యిహము మరచి
జన్మాంతర బంధములెల్ల విడిచి
ఆ మహర్జ్యోతిలో లీనము కానా
ఆ మహా ప్రభునిలో లీనము కానా
ఓ రామా! రఘురామా! కైవల్య రామా!
చిత్రం : కథానాయిక మొల్ల
గానం : పి.సుశీల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం:ఎస్.పి.కోదండపాణి
Sunday, December 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment