కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
గుణమెంట లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణముచే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు
చిత్రం : నాదీ ఆడజన్మే
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల
Subscribe to:
Post Comments (Atom)
ఎంత మంచి పాట !ఈ పాట నా చిన్నతనంలో భట్టిప్రోలులో విన్నా.ఈ పాట విన్నప్పుడల్లా నాకు భట్టిప్రోలు గుర్తుకొస్తుంది.
ReplyDelete