జోహారు శిఖిపించమౌళి
జోహారు రసరమ్య గుణశాలి! వనమాలి!
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగార మొకకంట! జయవీర మొకకంట!
చిలకరించి చెలువుమించి నిలిచిన
శ్రీకర నరవర! సిరిదొర //జోహారు//
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నెరసిన
అవతారమూర్తి! ఘనసార కీర్తి //జోహారు//
చకిత చకిత హరిణేక్షణా వదన
చంద్రాకాంతు లివిగో!
చలిత లలిత రమణీ చేలాంచల
చామరమ్ము లివిగో!
ఝళం ఝళిత సురలలనా నూపుర
కలరవమ్ము లివిగో! మధు
కరరవమ్ములివిగో ! మం
గళరవమ్ములివిగో !
దిగంతముల అనంతముగ గుబాళించు
సుదూర నందన సుమమ్ము లివిగో
చిత్రం : శ్రీ కృష్ణ విజయము
గానం : పి.సుశీల
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల
Wednesday, December 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment