యాడగాల వడ్డావురో నా మొగుడా!
యాడగాల వడ్డావురో నా మొగుడా!
కూడులేక పిల్లలేమొ కుమిలి చస్తుండ్రూ
పాడు ముండకొడుకు నీకు బుద్ధి రాదు ఏమిసేతు//యాడ//
కల్లుదాగ నేబోతిని నా పెళ్ళామొ!
కల్లెంత కమ్మగున్నదే నా పెళ్ళామొ
కల్లుకేమొ కైపెక్కి ఒల్లుకేమొ తిమ్మిరెక్కె
కల్లుదాగి వస్తుంటె కాలుజారి పడ్డానె
కల్లుమీద మన్నువడ్డారో నీ పీనుగెల్లా!
కల్లెట్టా మరుస్తవురో నీ పీనుగెల్లా!
తల్లి పిల్లలోము మేము తల్లడిల్లి చస్తుంటే
తాళిబొట్టు అమ్ముకొని తందనలాడెదావు
కల్లెంత కమ్మగున్నదే నీ కాల్లుమొత్త!
లొల్లయితే జెయ్యాబోకే నీ కాల్లుమొత్త
ఇల్లు పిల్లలిడిచిపెట్టి ఈదులల్ల జీతముండి
కల్లుదాగుకుంట నేను కడుపు నింపుకుంటగాని
సావనన్న సావవేమీరో నీదుంపదెగ!
సంసార మెట్లుజేతురో నీ దుంపదెగ
దేవుడా నేనేమి సేతు దిక్కెవరింక నాకు
దివాల్‌కోరు మొకపోడ దిగజారి పోయినోడ
సావు గీవు అన్నావంటే నాయాలి నిన్ను
సావ సావ జంపేదానే నాయాలి నిన్ను
కావరంబుబట్టి నీవు కానిపోని మాటలంటె
సావదన్నె దాను నాదు సంగతింక తెలియదేమొ
రచన : ఆర్. వీరాచారి
Saturday, December 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment