
అదే చిరునవ్వు… అదే చిరునవ్వు….
రెండు గులాబీలపై మల్లెమొగ్గ అలవోకగా వాలినట్లు
మేఘమాల కౌగిలినుండి బాలభానుడు బయటపడినట్లు
నవమి నాటి నెలవంక ఆకృతి సంతరించుకున్నట్లు
నీ దగ్గర నా హృదయం కుశలమేనన్నట్లు..
నువ్వంటే నా ఆశా దీపం
నువ్వంటే నా కవితా రూపం
నువ్వంటే నాలోని నిగూఢ తేజం
నువ్వంటే మమతల మణిహారం
నువ్వంటే సొగసుల కావ్యం
నువ్వంటే అందని దూరం
నువ్వంటే ఓ మధుర జ్ఞాపకం
నువ్వంటే వలపుల విరిబాణం
నువ్వంటే నువ్వంటే నా ప్రాణం..
రచన : మాధవ్ శర్మ
0 comments:
Post a Comment