
అప్పుడే మాటలు నేర్చిన చిన్నారి పలుకులు
పొడి నేలపై కురిసిన వర్శం చినుకులు
అడవిలో నెమళి అందమైన నడకలు
అమ్మచేతిలోని అమృతం మెతుకులు
రాయలేము ఏ కవితలు
చెప్పలేము ఏ మాటలు
పాడలేము ఏ పాటలు….
పిల్లగాలి వీచినా నీ ఊసులే
చల్లగాలి తాకినా నీ బాసలే
చెట్టు కొమ్మ కదిలినా నీ శ్వాసలే
కనులు తెరిచి నిలుచున్నా
కనులు మూసి నిదురించినా
కనులలోన నీ రూపే
కలలోనా నీ ధ్యాసే
ప్రతి నిముషం నీ పేరు
తలవనంటే నమ్మరు ఎవరూ..
నిన్ను చూసిన ఆ నిముషం
మనసంతా సంతోషం
ఎద నిండా ఉత్సాహం
నిజంగా నిను చూసిన ఆ తొలి క్షణం
నేను కనురెప్ప కొట్టలేదు
నా మనసుకు ఏదీ తట్టలేదు
నేను ఆ రోజు అన్నం ముట్టలేదు
నా కంటికి ఏదీ గిట్టలేదు
నా శ్వాస నను తట్టలేదు
ఐనా నా మనసు నను తిట్టలేదు
ఒట్టు!! ఇది ప్రేమ అని నాకు ఎవరూ చెప్పలేదు...
రచన : మాధవ్ శర్మ
0 comments:
Post a Comment