Ads 468x60px

Wednesday, October 24, 2007

ఆమె….అవి పెదవులు కావు
కెంజాయ రంగును అలుముకుని ఎక్కుపెట్టిన హరివిల్లులు
అవి నవ్వులు కావు
నా హృదయంలో తీయగా వీచే మన్మధ శరాలు
అవి మాటలు కావు
ఎన్నటికీ తరగని శరపరంపరను నిక్షిప్త పరుచుకున్న అమ్ములపొదులు
అవి చూపులు కావు
నా ఎదను ప్రేమగా కోస్తున్న కరవాలాలు
అవి నడకలు కావు
హిమవన్నగము నుండి జాలువారిన జలపాతాల హొయలు
అవి అడుగుల చప్పుళ్ళు కావు
నా మదిలో సమ్మోహన రాగాలు పలికిన భూపాల రాగాలు
ఒక మేఘం .. మధ్యకు చీలితే కనిపించే
నీలిరంగుల ఆకాశమే .. ఆమె పాపిట.

దట్టమైన మేఘాలే ఆమే కురులు
దశమినాటి జాబిలి లాంటి నుదురు
ఆ మధ్య కస్తూరీ తిలకం
కళ్ళు కలువలు
ముక్కు సంపెంగ
పెదవి పగడం
వెరసి….
ఆమె ఆ బ్రహ్మ సృష్టించిన మెరుపుతీగ..
ఆమె …ఆమె……

రచన : మాదవ్ శర్మ

2 comments:

Share

Widgets