
ప్రేమంటే చిరుగాలి అలలమీద
రాసుకున్న చిరునవ్వుల గీతం
రాత్రి పగలు మరిచి నిద్రాహారాలు విడిచి
దీక్షగా గీసుకున్న చిత్రం.
నీవు తలుచుకుంటే
నీ జ్ఞాపకాన్ని నేను
నీవు మలుచుకుంటే
నీ రూపాన్ని నేను
నీవు ఆలపించుకుంటే
నీ రాగాన్ని,పల్లవినీ నేను
నీవు ఆనందిస్తే
నీ దరహాసాన్ని నేను
నీవు రాసుకుంటే
నీ భావాన్ని నేను
నీవు రాసుకుంటే
నీ భావాన్ని నేను
నీవు రమ్మంటే
నీ దాసుడిని నేను
నీవు మర్చిపోతే
నీ స్మృతిని నేను
రచన : మాధవ్ శర్మ
0 comments:
Post a Comment