Ads 468x60px

Friday, October 26, 2007

సీతారాముల కళ్యాణము చూతము రారండి

సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి


జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

చిత్రం : సీతారాముల కళ్యాణం
రచన : సముద్రాల సీనియర్
గానం : పి.సుశీల బృందం

4 comments:

  1. Very very very beautiful song - wonderful lyrics, great picturisation, it's just fantabulous...

    Thank you for posting the lyrics...was not sure if it was "cempagavAci cukkanu beTTi"..I guess it should be "cempagavAsi" ..I might be wrong...but...

    Any ways thanks again

    ReplyDelete
  2. ధన్యవాదాలు వంశీగారు. చిన్న టైపింగ్ పొరపాటు.

    అది చెంపకవాకి అని ఉండాలి..సరిదిద్దాను.
    నిజంగా అద్భుతమైన పాట అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సీతారాములు ఎంత ముద్దుగా , అందంగా ,అమాయకంగా ఉన్నారో చెప్పలేను. మళ్ళీ ఇంతవరకు ఒక్క హీరోహీరోయిన్ కూడా అలా కనపడలేదు నాకు.

    ReplyDelete
  3. hAsini gAru

    it is "cempa javvAji cukkanu beTTi" ..I was wrong the first time...but it is "cempa javvAji"

    ReplyDelete
  4. ఈ సృష్టిలో నదులు, పర్వతాలు, చెట్లు వున్నంతకాలం మీరు వ్రాసిన రామాయణము వుంటుంది. అంత వరకు మీరు బ్రహ్మ లోకమందు ఉందురుగాక. ఇది వాల్మికి బ్రహ్మ నుంచి పొందిన వరం. ఈ పాటను సృష్టించి సముద్రాల, సుశీల, గాలిపించేల నరసింహారావు వాద్య సహకారమందించిన ఎందఱో అజ్ఞాతులు కూడా అదే వరాన్ని అయాచితముగా పొందారు. ఇంతటి అదృష్టాన్నిపొందిన వారు ధన్యులు. ఇది కేవలం మన తెలుగు వాళ్ళకే స్వంతం. ప్రతి తెలుగు వాడు గర్వించాలి.
    అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు - శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష

    ReplyDelete

Share

Widgets