
కంటి కొనల నిలిచిన కన్నీటి చుక్క
సంద్రమౌతుంది…
అణువే కదా అని వదిలేస్తే స్మృతి
అనంతమౌతుంది,,, ఆకాశమౌతుంది…
ఆలోచన ప్రవాహమైతే
దానికి అడ్డం అదుపూ నీవే
బాధపెడుతున్న గాయానికి
ఓదారుస్తున్న స్నేహానివి నీవే…
ఉబికివస్తున్న కన్నీరు సైతం నీ
జ్ఞాపకాలనే మోసుకువస్తుంది
చెలి చేసిన గాయానికి నా
ప్రణయ విపంచి మూగవోయింది….
కలల మబ్బు దొంతరలను తొలగించేంతలో
నీవు రాగమంజరివై నా కోసమే
అరుదెంచిన వసంతానివై ఎదురువస్తావు
నిను చూసిన నా భావప్రకంపనలు ఏమని చెప్పను?
రచన : మాధవ్ శర్మ
0 comments:
Post a Comment