Ads 468x60px

Saturday, May 26, 2007

తలనిండ పూదండ

ఆ రజనీకర మోహన బింబము
నీ నగుమోమును బోలునటే
కొలనిలోని నవ కమల దళమ్ములు
నీ నయనమ్ముల బోలునటే
ఎచట చూచిన ఎచట వేచినా
నీ రూపమదే కనిపించినదే


తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే


పూలవానలు కురియు మొయిలువో
మొగలిరేగులలోని సొగసువో
పూలవానలు కురియు మొయిలువో
మొగలిరేగులలోని సొగసువో
నా రాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే


నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిబిడే శృంగారాలు
నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో నిబిడే శృంగారాలు
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలూ…
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే
మొలక నవ్వుల తోడ మురిపించబోకే

గానం : ఘంటసాల వేంకటేశ్వరరావు



powered by ODEO

1 comments:

Share

Widgets