ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
నన్నే వలచి నా మేలు తలచి
నన్నే వలచి నా మేలు తలచి
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
నీ కన్నుల వెలుగులే తారకలై నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా
నీ సగము మేన నేనే నివసించగా
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
నిన్నే వలచి నీ మేలు తలచి
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ …. నీ జాబిలినీ
ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా … ఆహాహా … ఆహాహహా ……
చిత్రం : సుపుత్రుడు
గానం : ఘంటసాల, సుశీల
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం : కే.వి.మహాదేవన్
powered by ODEO
Friday, May 25, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment