లేపకే నా యెంకి లేపకే నిదరా
యీపాటి సుకము నేనింతవర కెరుగనే
లేపకే నా యెంకి....
కలలోన నా యెంకి
కతలు సెపుతున్నాది
వులికులికి పడుకొంట
’ఊ’కొట్టుతున్నాను!
లేపకే...
కతలోని మనిసల్లె
కాసింతలో మారి
కనికట్టు పనులతో
కత నడుపుతున్నాది!
లేపకే...
రెక్కలతో పైకెగిరి
సుక్కల్లే దిగుతాది
కొత్త నవ్వుల కులుకు
కొత్త మెరుపుల తళుకు
లేపకే...
తెలివి రానీయకే
కల కరిగిపోతాది
ఒక్క నేనే నీకు
పెక్కు నీవులు నాకు!
లేపకే...
Saturday, May 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment