Ads 468x60px

Tuesday, May 22, 2007

ఆనాటి నావోడు

ఆనాటి నావోడు సెందురూడా!
అలిగి రాలేదోయి సెందురూడా!

"యెంకి మనమిద్దరమే
యెవ్వరొ"ద్దన్నాడు;
"యీ సేలు యీ తోట
లింక నీ"వన్నాడు--

మాటాడుతుండంగ సెందురూడా!
మచిదా పోయేవు సెందురూదా!

"కలకాల మీదినమె
నిలుసు మన" కన్నాడు
"గాలికైనా తాను
కవుగిలీ"నన్నాడు--

నను చూసి నవ్వేవు సెందురూడా!
నాయనా నా ముద్దు సెందురూడా!

నా కాసి సూశాడు
నీ కాసి సూశాడు
"మద్దె సెంద్రుడె మనకు
పెద్దమని"సన్నాడు--

కన్నీరు నీకేల సెందూరూడా!
కనికారమే శాన సెందురూడా!

0 comments:

Post a Comment

Share

Widgets