Ads 468x60px

Tuesday, May 22, 2007

గోవు మా లచ్చిమి

గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు!
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు!

యెంకితో కూకుండి
యింత సెపుతుంటే
తనతోటి మనిసల్లె
తల తిప్పుతాదీ!

గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు!
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు!

యెంకి సరసాలాడ
జంకుతా వుంటే
సూసి సూడక కన్ను
మూసి తెరిసేదీ!

గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు!
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు!


కోరి కూకుని నేనె
పోరు పెడుతుంటే
తల్లిడిపి పిల్లల్లె
తెల్ల పోతాదీ!

గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు!
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు!

0 comments:

Post a Comment

Share

Widgets