Ads 468x60px

Tuesday, May 1, 2007

యెంకిరాణి

పూల బూరను వేడి
గాలితో నింపి
తేనె గొంతున వింటి
తీరైన పాట

గాలిలో యెగరేసి
నీల చుక్కలను
రమ్మంటి చేతిలో
రాలె రతనాలు

పూలతో యెంకి నే
పూజింఫ బోతి
యెంకి నిలువున మెరిసె
యెవ్వరో రాణి

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

1 comments:

  1. యెంకి పాటలు అనే మాట చిన్నప్పటినుండి వినడమే గాని ఎప్పుడు చదవలేదు.

    చాలా బాగున్నాయండి...

    ReplyDelete

Share

Widgets