అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలల్లోన వెన్న ఏదమ్మా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా
పచ్చిపాలమీద మీగడుంటుందా . ఆ వేడిపాలల్లోన వెన్న ఉంటుందా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ .. అహ …
వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా
మినప సున్నుండలేమాయే కోడలా …
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారె అత్తమ్మా
వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా…. ఉండు నీ పని చెబుతా…
కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని కాలంట కుట్టిందీ తేలు
అయ్యో.. అబ్బా … అమ్మా … అయ్యో
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆహ.. ఊహూ
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ .. అహ …
గానం : ఘంటసాల వేంకటేశ్వరరావు
powered by ODEO
Saturday, May 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment