యింతేనటే సంద్ర మెంతో యనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!
నా వీతి నా జాతి
నా వారె పోనాడ
మరిగి నా మనసు సా
గరమాయె నన్నారు
ఇంతే...
నా రాజె నా కాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు
ఇంతే...
సత్తె మెరిగిన పాప
పొత్తిళ్ళలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు
అంచు దరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను
ఇంతే...
రచన :నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
Tuesday, May 1, 2007
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment