Ads 468x60px

Tuesday, May 1, 2007

కో కో కో

కొండ తిరిగీ
కోన తిరిగీ
చీర చెరుగున
కూరిచితిరా
గరికపూలా కంఠమాలా!


ఆవు నడిగీ
అడవి నడిగీ
పూల గిన్నెల పొందు పరచితి
గుమ్మ పాటు కొమ్మ తేనె

చాయవన్నెల
లోయ బయలా
పచ్చిక మెత్తల
పానుపు పైన
’కో క’ యందు’కో’ యనరా

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets