చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే!
నీకే మనసియ్యలని వుందిరా 11 చాంగురే 11
ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముందిమేటి దొరవు అమ్మక చెల్ల
నీ సాటి ఎవ్వరునుండుట కల్ల 11 చాంగురే 11
కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకోగుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా 11 చాంగురే 11
గుబులుకొనే కోడెవయసులెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింతఉండనీయవేమి సేతురా
కై దండలేక నిలువలేనురా 11 చాంగురే 11
చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం
గానం : జిక్కీ
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం : పెండ్యాల
Monday, January 1, 2007
Subscribe to:
Post Comments (Atom)
super job sir....wonderful i am loving it....a very happy and prosporus new year to u and ur family....waiting for more old songs
ReplyDelete