పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి -2
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి ....
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి -2
ఏవీ .. ఏవీ ?అవి నీ ఓర చూపులేనోయి....
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు -2
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు -2
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో ......
చిత్రం : చిక్కడు దొరకడు.
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, సుశీల
Monday, January 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
This comment has been removed by the author.
ReplyDeleteనారాయణరెడ్డిగారి పాటలు చాలా వరకు సంభాషణలలాగా వుంటాయి. పాటవినగానే ఇది ఆయనే రాసివుంటారని తెలిసిపోయేట్టుగా. మరిన్ని రాయండి ఈ లేబుల్‌లో. నన్నుదోచుకొందువటే... ఆయన మొదటి సినిమాపాట అంటారు.
ReplyDelete