అపురూప సౌందర్యరాశి అయిన యువతి శరీరంలో భావుకునికి కనిపించని
విశేషాలు ఏవీ లేవు. అవి అన్నీ అపూర్వాలే. అమోఘాలే. అసలు అందమంటేనే
అమోఘం. తనకు నచ్చిన తాను మెచ్చిన ఒక చక్కని చుక్కను ఒక
ఆరాధకుడు ఇలా వర్ణించాడు.
శరీరాన్ని అలంకరించుకోవడానికి ఎన్నో అలంకరణలున్నాయి.చెవికి బంగారు
కమ్మలు,మెడకు ముత్యాల హారాలు, చేతులకు అందమైన కంకణాలు, కాళ్ళకు
వెండి గజ్జెలు, నడుముకు వడ్డాణం, జడకుప్పెలు, ...ఇలా ఎన్నో ఆభరణాలు
యువతిని లావణ్యవతిని చేస్తాయని అంటారు. కాని ఈ ముగ్ధమోహన సౌందర్యవతికి
అలా కాకుండా ఈమె శరీరంలో చేరినందువల్ల వాటికే కొత్త రూపం వచ్చింది.
అంగం భూషణనికరో
భూషయతీత్యేష లౌకికో వాద:
అంగాని భూషణానాం
కామపి సుషమామజీ జనం స్తస్యా:
రచన : డా.ఆయాచితం నటేశ్వరశర్మ.
Saab 0 comments is no good.
ReplyDeleteSo wherever I go, I try to leave atleast one comment.
This is yours truly, MT