లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలొ పంచాయితీలు పట్టణాలలొ ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు నిరుద్యోగులను పెంచారూ
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
చట్టసభలలొ సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసీ
డిల్లీ సభలో పీఠం వేసీ
డిల్లీ సభలో పీఠం వేసీ
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూ
Tuesday, January 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
♫
♩
♪
♫
♭
♩
♫♭
0 comments:
Post a Comment