ఆది బిక్షువు వచ్చె ఆత్మ బిక్ష కొరకు
హిమనగము వృషభమై వెంట రాగ
'హరి ' దాసుడయ్యె గృహలక్ష్మి ప్రాంగణాన
అలిగి వచ్చిన సిరి కర్షకుల ఇంట కొలువుదీర
తరళ నీహారికల జలతారు తెరల తొలచి
తరలె దినకరుడు మకర రాశిలోకి
అలరు పడరులల్ల రంగవల్లికల యందు
సొబగు గొబ్బియలు తళుకులీన
విరిసె సంగ్రాంక్తి రసరమ్య కావ్యమై
ఊరి పొలిమేరల బంతిపూల నెత్తావి తావులను జల్లి
కోడె దూడల పొగరు
కోడి పందెపు వగరు
భోగి మంటల వేడి
రేగుపండ్ల తీపి
చెరకు గానుగల కలిసి
పొద్దు పొడుపుల మెరిసి
కలిమి చెలిమి బలిమి నిచ్చు
సంక్రాంతికై కైమోడ్పు లిడగ
తెలుగు వెలుగు జిలుగు
క్రాంతి రథములై తరలి రండు.
టి.ఆర్. శ్రీనివాస్ ప్రసాద్
0 comments:
Post a Comment