Ads 468x60px

Saturday, January 6, 2007

టిక్కు టిక్కు ఇంగిలీసు

టిక్కు టిక్కు - ఇంగిలీసు - పట్నం పిల్లా


నీ పట్నం - సోకులు బలె జోరే పిల్లా
నీ పట్నం - సోకులు బలె జోరే పిల్లా


ఉల్లి పొర సీర - గట్టా నేలా పిల్లా
ఊరంతా బలా - దూరెందుకె మల్లా
చీరెంటె చిర్రెత్తె - వెందుకె పిల్లా
గౌనులంటె మోజెక్కే - వెందుకె మల్లా 11 టిక్కు 11


బోడనెత్తి జూసి - మురియనేలా పిల్లా - హా
అందమయిన - వాలుజడా వేయవె మల్లా
మాటంటే మాటా కాదు - ఎర్ర బుర్ర పిల్లా
సోకంటే సోకు కాదు - సూడవె మల్లా 11 టిక్కు 11


మిద్దెలోని మేడలోని - ముద్దుల పిల్లా
నిజమెరిగి నీ పొగరూ - తగ్గించుకో
పల్లెటూరి నీటుదాన్ని - గురుతుంచుకో
పదిలంగా గుండెలోన - దాచేసుకో 11 టిక్కు 11

0 comments:

Post a Comment

Share

Widgets